ఖతార్: గృహ కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు తప్పనిసరి..యజమానులకు ఆదేశాలు
- April 30, 2020
దోహా:ఇళ్లలో పని చేసే కార్మికులు అందరికీ ఇక నుంచి తప్పనిసరిగా బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయాలని యజమానులను ఖతార్ ప్రభుత్వం ఆదేశిచింది. ఈ మేరకు ఖతార్ కార్మిక, సంక్షేమ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ సమాజంలోని అన్ని వర్గాలకు బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు అవకాశం ఇస్తోందని...అంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. అయితే..బ్యాంక్ అకౌంట్ తెరిచేందుకు ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన పని లేదని కూడా స్పష్టం చేసింది. ఉచితంగా బ్యాంక్ ఖతా అందించటంతో పాటు..కనీస బ్యాలెన్స్ కూడా మెయిన్టెన్ చేయాల్సిన అవసరం లేదు. యజమానులు తమ గృహ కార్మికులకు అకౌంట్లు ఓపెన్ చేయటం ద్వారా ఇక నుంచి జీతాలను నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేసే అవకాశం ఉంటుందని కూడా మంత్రిత్వ శాఖ వివరించింది. అంతేకాకుండా బ్యాంక్ కార్డుల ద్వారా ఎలక్ట్రానికల్ లావాదేవీలకు ఆస్కారం ఉంటుందని తెలిపింది. అంతేకాదు..ఒక్కసారి కార్మికుడి ఒప్పందం రద్ద అయితే..బ్యాంక్ కార్డును రద్దు చేసుకోవచ్చు. అప్పటివరకు బ్యాంకులో ఉన్న నగదు గృహకార్మికులకు చెందుతుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!