మస్కట్ః ఒమన్ లో ప్రవాసీయులకు షాక్..ప్రభుత్వ సంస్థల్లో ఒమనైజేషన్ షురూ
- April 30, 2020
మస్కట్:ఒమన్ ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న ప్రవాసీయులకు ప్రభుత్వం షాకిచ్చింది. ఒమనైజేషన్ లో భాగంగా ఇక నుంచి అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రవాస ఉద్యోగుల స్థానంలో ఒమనీస్ ను భర్తీ చేసే ప్రక్రియను త్వరలోనే ప్రారంభించబోతోంది. ప్రవాసీయుల స్థానంలో ఒమనీస్ ను భర్తీ చేయటం ద్వారా సుల్తానేట్ అభివృద్ధిలో వారు కీలక పాత్ర పోషిస్తారని ప్రభుత్వం చెబుతోంది. వీలైనంత వేగంగా ఈ భర్తీ ప్రక్రియ చేపట్టాలని కూడా ప్రభుత్వం జారీ చేసిన సర్క్యూలర్ నెంబర్ 14, 2020లో స్పష్టంగా ఆదేశించినట్లు ఆర్ధిక మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ సంస్థల్లో సమర్ధవంతంగా విధులు నిర్వహించేలా ఒమనీస్ కు నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు కూడా ఆర్ధిక శాక వివరించింది. ఒమనైజేషన్ ను అమలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచే ప్రారంభించేందుకు తగినంత అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వ సంస్థల్లో క్వాలిఫైడ్ ఒమనీస్ తగిన ఉద్యోగం ఇచ్చే అనువైన వాతావరణం ఉంటుందని ఆర్ధిక శాఖ అభిప్రాయపడింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు