అక్రమ వలసదారులకు అండగా నిలచిన తెలంగాణ జాగృతి కువైట్

- April 30, 2020 , by Maagulf
అక్రమ వలసదారులకు అండగా నిలచిన తెలంగాణ జాగృతి కువైట్

కువైట్:కువైట్ లో ఉంటున్న తెలంగాణ ప్రవాసులకు మేమున్నామంటూ అండగా నిలిచారు  తెలంగాణ జాగృతి కువైట్ బాద్యులు. 2018 తరువాత మళ్ళి 2020 లో కువైట్ లో అక్రమంగా ఉంటున్న వారికి ఆమ్నెస్టీ ప్రకటించిన కువైట్ ప్రభుత్వం వారిని తిరిగి తమ స్వదేశానికి వెళ్లే అవకాశం కల్పించింది. కాగా కరోనా మహమ్మారీ వలన ఏర్పడ్డ లాక్ డౌన్ కారణంగా మన తెలంగాణ వాసులు ఏర్పడ్డ ఇబ్బందులను తెలంగాణ వలస కార్మికులు కొందరు తెలంగాణ జాగృతి అధ్యక్షులు  కల్వకుంట్ల కవిత దృష్టికి తీసుకువెళ్లారు. 

కవిత సూచన మేరకు వినయ్ ముత్యాల ఆధ్వర్యంలో కువైట్ జాగృతి జనరల్ సెక్రటరీ మార్క ప్రమోద్ కుమార్ పర్యవేక్షణలోని బృందం దరఖాస్తు ఫారం నింపడం నుండి అన్ని తామై ఇండియన్ ఎంబసీ కి పలు మార్లు సంప్రదించగా వారు అక్రమంగా ఉంటున్న వారు తిరిగి ఇండియా వెళ్ళడానికి తాత్కాలిక పత్రములు ( ఎమర్జెన్సీ సర్టిఫికెట్ ) దశలవారీగా కువైట్ లో విసా నిభందనలకు విరుద్ధంగా  ఉంటున్న తెలంగాణ వలస కార్మికులకు అందించడం జరిగింది.  కువైట్ లో అక్రమంగా  ఉంటున్న భారతీయ కార్మికులు ఆమ్నెస్టీ ని వాడుకొని స్వదేశానికి వెళ్ళాలనుకుంటే తమను సంప్రదించాలని తెలంగాణ జాగృతి కువైట్ అధ్యక్షులు వినయ్ కుమార్ ముత్యాల కోరారు. ఈ కార్యక్రమంలో TJK జాయింట్ సెక్రెటరీ మహమ్మద్ సైఫుద్దీన్ రాజన్న మామిడిపల్లి, రాజశేఖర్ వరం, కోర్ కమిటీ సభ్యులు, మామిడాల రత్నాకర్, లవన్ కుమార్,  గుర్రం కిరణ్ కుమార్ ,మంత్రి రమేష్, వెంగళ లక్ష్మణ్ గౌడ్, పసరాతి రాజయ్య  శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆమ్నెస్టీ ని వాడుకుని స్వదేశానికి వెళ్ళాలనుకున్న తమకు జాగృతి కువైట్ సభ్యులు విదేశీ గడ్డ పై చేసిన సహాయానికి తెలంగాణ వలస కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com