యూఏఈ: చొరవ తీసుకొని వారికి తెలపండి అంటున్న కాన్సుల్ జనరల్

- April 30, 2020 , by Maagulf
యూఏఈ: చొరవ తీసుకొని వారికి తెలపండి అంటున్న కాన్సుల్ జనరల్

యూఏఈ: భారత్ వెళ్లాలనుకునేవారికి అబుధాబి లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసి ఫారం లో తమ వివరాలను నింపాలని ప్రవాసీయులను కోరింది. దీనికి స్పందిస్తూ ఆన్‌లైన్ పోర్టల్‌లో మొత్తం 9,000 మంది భారతీయులు నమోదు చేసుకున్నారు. పెద్దఎత్తున ప్రవాసీయులు ఈ సౌకర్యం వినియోగిస్తున్నందున వెబ్‌సైట్ లో కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. అధికారులు దీనిని సరిచేసేందుకు అన్ని చర్యలు చేపట్టారు.

దుబాయ్‌లోని భారత కాన్సుల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ, "ప్రకటించిన ఈ గణాంకాలు గురువారం (ఏప్రిల్ 30) ఉదయం 10 గంటల వరకు నమోదైనవి. డేటా సేకరణ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే, మేము డేటాను విశ్లేషించడం ప్రారంభించలేదు." వెబ్‌సైట్‌లో భారీగా ట్రాఫిక్ ఉన్నట్లు కనిపిస్తున్నందున కాన్సులేట్ దరఖాస్తుదారులు ఓర్పు వహించాలని ఈ సందర్భంగా విపుల్ కోరారు.

ఎమిరేట్స్‌లోని కమ్యూనిటీ గ్రూపులు మరియు భారతీయ సంఘాలు చొరవ తీసుకొని కార్మిక వర్గాలకు ఈ ఫారం గురించి తెలిపి నమోదు చేసుకోవడానికి సహాయం చేయమని కాన్సుల్ జనరల్ విపుల్ కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com