కోవిడ్ 19 :ఆస్పత్రి, నిర్బంధ శిబిరాలను పరిశీలించిన కువైట్ ప్రధాని
- May 01, 2020
కువైట్:కరోనాపై పోరాటంలో భాగంగా కువైట్ లో నిర్మించిన ఆస్పత్రులు, నిర్బంధ శిబిరాలను కువైట్ ప్రధాని షేక్ సబా ఖలేద్ అల్ హమద్ అల్ సబా పరిశీలించారు. తన పర్యటనలో భాగంగా ముందుగా అల్ అర్ధియా ప్రాంతంలోని ఆస్పత్రిలో వసతులను ఆయన పరిశీలించారు. అనంతరం మిష్రిఫ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నిర్బంధ శిబిరం (క్వారంటైన్ సెంటర్)ను పరిశీలించారు. ఈ క్వారంటైన్ సెంటర్ ను కువైట్ ఆయిల్ కంపెనీ, కువైట్ ఇంటీగ్రేటెడ్ పెట్రోలియం ఇండస్ట్రీస్ కంపెనీ సంయుక్తంగా నిర్మించాయి. కరోనాపై నియంత్రణ చర్యల్లో భాగంగా రోగుల కోసం క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు భాగస్వామ్యులు అయిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్‌కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్‌లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







