కువైట్: ప్రవాస భారతీయులకు ఊరట..ఫారం నింపమంటున్న ఎంబసీ

- May 01, 2020 , by Maagulf
కువైట్: ప్రవాస భారతీయులకు ఊరట..ఫారం నింపమంటున్న ఎంబసీ

కువైట్: ప్రవాస భారతీయులకు ఊరట.. భారత్ వెళ్లాలనుకునేవారికి కువైట్ సిటీ లోని  భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్ కు విమానాలు తిరిగి ప్రారంభించడం పై సమాచారాన్ని కోరుతూ కువైట్ లోని ప్రవాస భారతీయులు చాలామంది రాయబార కార్యాలయానికి కాల్ చేస్తున్నట్టు తెలిపింది.

"ప్రవాస భారతీయులు క్రింద పొందుపరిచిన ఫారం లో తమ వివరాలను నింపాలి. ఈ ఫారం యొక్క ఉద్దేశ్యం సమాచార సేకరణ మాత్రమే. భారత్ కు ఎంతమంది వెళ్లాలనుకుంటున్నారు, వారు ఏ విమానాశ్రయం లో దిగాలని అనుకుంటున్నారు అనే ట్రాఫిక్ (రద్దీ) అంచనాకు ఈ డేటా సేకరణ ఉపయోగపడుతుంది. ఈ ఫారమ్ ఒక సమయంలో ఒక వ్యక్తి కోసం నింపాలి. కుటుంబ సభ్యుల వివరాల కోసం, ప్రతి సభ్యునికి ప్రత్యేక ఫారమ్ నింపాలి. ఫారం నింపిన తర్వాత, ఈ విషయంలో రాయబార కార్యాలయానికి తదుపరి ఇ-మెయిల్ పంపాల్సిన అవసరం లేదు" అని ఎంబసీ అధికారులు తెలిపారు.

భారత్ కు వెళ్లాలనుకునే వారు ఆన్ లైన్ ఫారం నింపడానికి ఈ  క్రింద ​లింకు ను క్లిక్ చేయాలి.http://indembkwt.com/eva/?fbclid=IwAR3d2_HGFwMUEBAr4c6I4E6IuzkXvw70WAkH5iHFPnrtxftcC2fFs956DOo

కరోనాను ఎదుర్కోవటానికి మే 3, 2020 వరకు భారతదేశం అంతటా పూర్తి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. భారతదేశానికి ప్రయాణీకుల విమానాలను తిరిగి ప్రారంభించాలనే నిర్ణయం వెలువడిన వెంటనే రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన చేస్తుంది. కావున, తదుపరి ఆదేశాల వరకు విమాన సర్వీసులు ఉండవు అని తేల్చి చెప్పిన అధికారులు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com