5.96 మిలియన్‌ టన్నుల ఫుడ్‌ తయారుచేస్తోన్న 568 యూఏఈ ఫ్యాక్టరీలు

- May 01, 2020 , by Maagulf
5.96 మిలియన్‌ టన్నుల ఫుడ్‌ తయారుచేస్తోన్న 568 యూఏఈ ఫ్యాక్టరీలు

దుబాయ్:ఎమిరేట్స్‌ ఫుడ్‌ కౌన్సిల్‌, మినిస్ట్రీ ఆఫ్‌ ఎనర్జీ అండ్‌ ఇండస్ట్రీతో కలిసి సంయుక్తంగా ఫుడ్‌ ప్రొడక్షన్‌కి సంబంధించిన వివరాల్ని వెల్లడించింది. మొత్తం 568 ఫ్యాక్టరీలు యూఏఈలో 5.96 మిలియన్‌ టన్నుల ఫుడ్‌ మరియు బెవరేజ్‌ ప్రోడక్ట్స్‌ని ప్రతి యేడాదీ తయారు చేస్తున్నాయనీ, ఇందులో 2.3 మిలియన్‌ టన్నుల ఎసెన్షియల్‌ ఫుడ్‌ ఐటమ్స్  వుంటున్నాయని నివేదిక తెలిపింది. మినిస్ట్రీ ఆఫ్‌ ఎనర్జీ అండ్‌ ఇండస్ట్రీ లైసెన్సింగ్‌ సిస్టమ్ ద్వారా రిజిస్టర్‌ అయిన ఫ్యాక్టరీల నుంచి సేకరించిన సమాచారమిది. అత్యవసర సమయాల్లో మరింతగా ఫుడ్‌ ప్రొడక్షన్‌ చేసేందుకు ఈ ఫ్యాక్టరీల్లో వెసులుబాట్లు వున్నాయని అధికారులు చెబుతున్నారు. అబుదాబీలో 40, దుబాయ్‌లో 315, షార్జాలో 77, అజ్మన్‌లో 73, ఉమ్ అల్‌ కువైన్‌లో 34, రస్‌ అల్‌ ఖైమాలో 23, ఫుజారియాలో 7 ఫ్యాక్టరీలు వున్నాయి. అత్యధికంగా వీటిల్లో 16.3 మిలియన్‌ టన్నుల ఆహారోత్పత్తుల్ని తయారు చేసేందుకు వీలుంది. 


--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com