'సర్దార్ గబ్బర్‌సింగ్' చిత్రం సెట్లో శంకర్‌దాదా..
- January 28, 2016
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న 'సర్దార్ గబ్బర్‌సింగ్' చిత్రం సెట్లో శంకర్‌దాదా చిరంజీవి సందడి చేశారు. చిత్రం సెట్లో తన తమ్ముడు పవన్‌కల్యాణ్‌తో సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోను నిర్మాత శరత్ మరార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. శంకర్‌దాదా సర్దార్ సెట్‌కు విచ్చేశారంటూ ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా చిత్ర బృందం కూడా తమ ఫేస్బుక్ ఖాతాలో మరికొన్ని ఫొటోలను పోస్ట్ చేశారు. ఇలా అన్నాతమ్ముడు కలిసి దిగిన ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.తమ అభిమాన హీరోలు ఒకే ఫొటోలో కనబడటం అభిమానులకు విశేషమే కదా మరి!. ఇటీవల పవన్‌కల్యాణ్ సైతం సర్దార్ సెట్ నుంచి నేరుగా తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి పలకరించిన సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్ సరసన జంటగా కాజల్ నటిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్‌లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







