మస్కట్:నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన తెలంగాణ బిజెపి NRI సెల్
- May 05, 2020
మస్కట్:కరోనా పరిస్థితుల నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నిరోధించే క్రమంలో చేపట్టిన లాక్ డౌన్ పరిస్థితులవల్ల ఒమన్ లో ఉన్న గల్ఫ్ కార్మికులు చేయడానికి పని లేక తినడానికి తిండి లేకా రూమ్ ల కిరాయిలు కట్టలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళను దృష్టిలో ఉంచుకొని "ఫీడ్ ద నీడీ" కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, తెలంగాణ బిజెపి NRI సెల్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ తోపాలి శ్రీనివాస్ పిలుపుమేరకు ఒమన్ లో బిజెపి తెలంగాణ NRI సెల్ మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు ఆధ్వర్యంలో 300 మందికి పదిహేను నుండి ఇరవై రోజులకు సరిపడే నిత్యావసర వస్తువులను అందించారు. ఒమన్ లో రెండు నెలలు గా తినడానికి ఇబ్బంది పడుతున్నటువంటి వారు వీరు ప్రారంభించిన హెల్ప్ డెస్క్ కు ఫోన్ చేసి సంప్రదిస్తున్నారు. ఒమన్ కన్వీనర్ కుమార్ మంచికట్ల సీనియర్ నాయకులు బాపురెడ్డి, మురళి వడ్లపాటి, నరేష్ ఆంబోజి, అది చిగురు, గరిగే రమేష్, భానాలా భాస్కర్ రెడ్డి, సాయి కిరణ్ రెడ్డి హెల్ప్ డెస్క్ ద్వారా నిత్యం వారిని సంప్రదిస్తూ సహాయం చేస్తున్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు