షార్జాలో భారీ అగ్ని ప్రమాదం...

- May 06, 2020 , by Maagulf
షార్జాలో భారీ అగ్ని ప్రమాదం...

షార్జా: షార్జాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.అల్ నహదా ప్రాంతంలోని 47 అంతస్తుల భవనంలో మంగళవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. పదో అంతస్తులో మంటలు చెలరేగి బిల్డింగ్‌లోని ఇతర అంతస్తులకు వ్యాపించాయి. దీంతో భవనం నుంచి స్థానికులు బయటకు పరుగులు తీశారు. సుమారు 3 గంటలపాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ బిల్డింగ్‌లో చాలా మంది భారతీయులు నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలైనట్లు తెలుస్తోంది.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com