జూన్ 1 నుంచి రెగ్యులర్ ఫ్లైట్ బుకింగ్స్ ప్రారంభం
- May 06, 2020
షార్జా: షార్జా కేంద్రంగా సేవలందిస్తున్న లో-కాస్ట్ ఎయిర్‌లైన్ ఎయిర్ అరేబియా, రెగ్యులర్ ప్యాసింజర్ ఫ్లైట్ బుకింగ్స్‌ని ఆన్లైన్ ద్వారా ప్రారంభించింది. జూన్ 1 నుంచి ఈ ప్రయాణాలు అందుబాటులోకి వస్తాయి. కరోనా వైరస్ నేపథ్యంలో విమాన ప్రయాణాలు మే 30 వరకు ఆగిపోయిన విషయం విదితమే. భారతదేశంలోని ముంబై, ఢిల్లీ, త్రివేండ్రం అలాగే పాకిస్తాన్‌లోని కరాచీ మరియు పెషావర్ ప్రాంతాలకు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. బంగ్లాదేశ్, లెబనాన్, ఈజిప్ట్, రష్యా సహా మరికొన్ని దేశాలకూ ఈ విమానాలు నడవనున్నాయి. రిటర్న్ విమానాలకు కూడా రిజర్వేషన్ ప్రారంభమయ్యింది.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







