ఆన్‌లైన్‌ పెళ్ళిళ్ళ కోసం 5,000 రిజిస్ట్రార్స్‌కి శిక్షణ

- May 06, 2020 , by Maagulf
ఆన్‌లైన్‌ పెళ్ళిళ్ళ కోసం 5,000 రిజిస్ట్రార్స్‌కి శిక్షణ

రియాద్‌: మినిస్ట్రీ ఆఫ్‌ జస్టిస్‌, 5,000 మంది మ్యారేజ్‌ రిజ్రస్టార్స్‌కి ఆన్‌లైన్‌లో పెళ్ళిళ్ళను అఫిసియేట్‌ చేయడం కోసం శిక్షణ ఇస్తోంది. కింగ్‌డమ్ వ్యాప్తంగా వీటిని త్వరలో అందుబాటులోకి తెస్తారు. ముందుగా క్యాపిటల్‌ రియాద్‌లో ట్రయల్‌ పీరియడ్‌ని నిర్వహిస్తారు. కోర్టులకు వెళ్ళే అవసరం లేకుండా, పేపర్‌ డాక్యుమెంట్ల అవసరం కూడా లేకుండా ఆన్‌లైన్‌ ద్వారానే ప్రక్రియ పూర్తి చేసేందుకు తగిన సాంకేతిక శిక్షణ రిజిస్ట్రార్స్‌కి అందిస్తున్నారు. డిజిటల్‌ మ్యారేజ్‌ కాంట్రాక్ట్‌, మొత్తం వివరాల్ని ఎలక్ట్రానిక్‌ పద్ధతుల్లో రూపొందబడి, మ్యారేజీ ప్రొసిడ్యూర్స్‌ని ఆటోమేట్‌ చేస్తుంది. 2,000 మ్యారేజీ లైసెన్సుల్ని జారీ చేసేలా 300 మంది రిజిస్ట్రార్స్‌కి తొలుత అనుమతినిచ్చారు. 252 ఆన్‌లైన్‌ మ్యారేజీ కాంట్రాక్టుల్ని రియాద్‌లో సర్టిఫై చేశారు. నాజిజ్‌ పోర్టల్‌ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com