యూఏఈ టూ ఇండియా..విమాన సమయంలో మార్పులు

- May 06, 2020 , by Maagulf
యూఏఈ టూ ఇండియా..విమాన సమయంలో మార్పులు

దుబాయ్: భారతీయులను స్వదేశానికి పంపే కార్యక్రమం రేపటి నుండి మొదలుకానున్నది.  మే 7, గురువారం మధ్యాహ్నం 2.10 గంటలకు కేరళలోని కోజికోడ్‌కు దుబాయ్ నుంచి బయలుదేరాల్సి ఉన్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ IX0344, మూడు గంటలు ఆలస్యంగా అనగా సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరుతుంది అని ప్రకటన.

దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్‌లోని ప్రెస్ కాన్సుల్ నీరజ్ అగర్వాల్ ఇలా అన్నారు: “సమయాలు సవరించబడ్డాయి. స్వదేశానికి తిరిగి పంపే విమానం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ IX0344 దుబాయ్ ఇంటర్నేషనల్ (టెర్మినల్ 2) నుండి కోజికోడ్‌కు రేపు సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరుతుంది. ధృవీకరించబడిన టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులు మాత్రమే విమానాశ్రయానికి వెళ్లాలి. వారు బయలుదేరే ఐదు గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలి. సుమారు 170 మంది ప్రయాణికులు ఈ విమానంలో ప్రయాణించనున్నారు" అని ఆయన తెలిపారు.

విమానాశ్రయాన్ని రద్దీ చేయవద్దని, సామాజిక దూరాన్ని కొనసాగించాలని, అధికారులు నిర్దేశించిన అన్ని అవసరమైన జాగ్రత్తలు పాటించాలని ఇండియన్ కాన్సులేట్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com