కోవిడ్ 19పై పోరాటానికి వినూత్న ఆవిష్కరణ..
- May 07, 2020
షార్జా:కరోనాపై పోరాటానికి ఇప్పటికే పలు చర్యలు చేపట్టిన యూఏఈ ఆరోగ్యశాఖ అధికారులు..మరో వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసం సెల్ఫ్ డ్రైవింగ్ వాహనం ద్వారా వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈ కిట్లు) పంపిణీ చేస్తున్నారు. షార్జాలోని పౌరులు, కార్మికులు అందరికీ ఈ వాహనం ద్వారా పీపీఈ కిట్లను సరఫరా చేస్తున్నారు. మాస్కులు, గ్లౌజులతో పాటు శానిటైజర్లతో కూడిన సెల్ఫ్ డ్రైవింగ్ వాహనం షార్జాలోని రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ప్రాంగణాలకు వెళ్తుంది. దీంతో అక్కడి ప్రజలు వాహనం నుంచి మాస్కులు, గ్లౌజులు, శానిటైజనర్లను తీసుకోవచ్చు. సెల్ఫ్ డ్రైవింగ్ వాహనం పూర్తిగా ఫిఫ్త్ జనరేషన్ టెక్నాలజీతో రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో వాహనాన్ని రూపొందించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







