దుబాయ్ పోలీస్ ల థర్మల్ గ్లాసుల వినియోగం దూరం నుంచే బాధితుల గుర్తింపు
- May 08, 2020
దుబాయ్:కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు వివిధ దేశాలు తమదైన రీతిలో కొత్తపుంతలు తొక్కుతున్నాయి. కొన్ని దేశాలు కోవిద్ 19 నిర్మూలించే దిశగా పరిశోధనలు చేస్తుంటే .. మరికొన్ని దేశాలు వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతున్నాయి. తాజాగా దుబాయ్ పొలీస్ వ్యవస్థ లో భాగంగా ఉన్న రవాణా రక్షణ శాఖ 'రోకిడ్ టి1' పేరుతో ధరించే స్మార్ట్ అద్దాలు వినియోగిస్తున్నారు.దీనివల్ల ఎదుటివారి శరీర ఉష్ణోగ్రత గుర్తించవచ్చు. వీటిని ప్రజాసంచారం, యాత్రికులు ఎక్కువగా ఉన్న చోట ఉపయోగించి కరోనా సోకిన వ్యక్తులను పసికడిస్తారు. ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన పరికరాన్ని తొలిసారిగా దుబాయ్ లో చేపడుతున్న కరోనా గుర్తింపు విధానం. కృత్రిమ మేధస్సు ద్వారా థర్మల్ కెమెరాల తో పాటు.. అయస్కాంత కిరణాలు సహాయంతో ఇది పనిచేస్తుంది. వాస్తవానికి ఈ తరహా వ్యాధి గుర్తింపు ప్రక్రియను చైనా తొలిసారిగా వినియోగించింది. ఇప్పుడు దుబాయ్ అదే పంథా అనుసరిస్తున్నది.
దుబాయ్ రక్షణ విభాగ రవాణా శాఖ డైరెక్టర్ ఒబాయిడ్ అల్ అద్బుర్ ఈ నూతన పరికరాలను గురించి వివరిస్తూ... ఈ ధరించే అద్దాలు 2 మీటర్ల దూరం నుంచి అవతల వ్యక్తి శరీర ఉష్ణోగ్రత కనిపెడుతుందని వివరించారు. ఒక నిమిషానికి100 మందిని పరీక్షించవచ్చని తెలిపారు. ఈ గ్లాసు ధరించడం వల్ల ఎదుటివ్యక్తి ముఖాన్ని గుర్తించి, నిర్దేశించిన దానికంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే వెంటనే ఆపరికరం చికిత్స కు సంబంధించిన కార్యాలయానికి సమాచారం పంపుతుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!