కువైట్:ఎయిర్ పోర్టు వెళ్లే వారికి కర్ఫ్యూ సమయంలోనూ అనుమతి
- May 10, 2020
కువైట్:కర్ఫ్యూ సమయంలోనూ ఎయిర్ పోర్ట్ ప్రయాణికులకు అనుమతి ఇచ్చేలా అంతర్గత మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పౌరవిమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ స్పష్టం చేసింది. దీంతో పూర్తి స్థాయి కర్ఫ్యూ సమయంలోనూ కువైట్ అంతర్జాతీయ విమానాశ్రాయానికి వచ్చి పోయే ప్రయాణికులకు అనుమతి ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే..ప్రయాణికులు ఖచ్చితంగా విమాన టికెట్లను భద్రతా సిబ్బందికి చూపించాల్సి ఉంటుంది. అంతేకాదు...విమానాశ్రాయానికి వచ్చే ళ్లైనా...విమానాశ్రయం నుంచి వెళ్లే వాళ్లైనా క్యాబ్ లో డ్రైవర్ తో పాటు ఒక్కరికి మాత్రమే అనుమతి ఇస్తారు. అదేవిధంగా క్యాబ్ డ్రైవర్ ప్రయాణికుడి తాలుకు విమాన ప్రయాణానికి సంబంధించి టికెట్ కాపీని తప్పని సరిగా చూపించాల్సి ఉంటుంది. భారత్ తో పాటు పలు దేశాలు కువైట్ లో చిక్కుకుపోయిన తమ దేశ పౌరులను స్వదేశాలకు తీసుకువెళ్తున్న విషయం తెలిసిందే. అయితే..పూర్తిస్థాయి కర్ఫ్యూ అమలులో ఉన్న నేపథ్యంలో స్వదేశాలకు వేళ్లే ప్రయాణికులకు ఈ మేరకు కువైట్ ప్రభుత్వం సూచనలు చేసింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







