విజిటర్స్ వీసా గడువు పెంపు
- May 11, 2020
మనామా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - నేషనాలిటీ పాస్పోర్ట్స్ అండ్ రెసిడెన్స్ ఎఫైర్స్, విజిటర్స్ వీసా గడువుని మూడు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే రెసిడెంట్ పర్మిట్ హోల్డర్స్ స్టేటస్‌ని ఈ ఏడాది చివరి వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కాగా, రెసిడెంట్ పర్మిట్స్‌కి సంబంధించి అన్ని రకాల ఫీజుల్ని తాత్కాలికంగా ఉపసంహరించుకుంటున్నారు. ఈ ఏడాది చివరి వరకు రెసిడెంట్ పీరియడ్‌ని ఆటోమేటిక్‌గా పొడిగించేలా చర్యలు చేపడుతున్నారు. ఎలాంటి అప్లికేషన్ సమర్పించాల్సిన అవసరం లేకుండానే గడువు తీరిన అలాగే చెల్లుబాటైన వీసాల గడవును 3 నెలలు పొడిగించనున్నారు. ఈ మేరకు ఎన్పిఆర్ఎ ఓ ప్రకటనలో స్పష్టతనిచ్చింది.మరిన్ని వివరాలకు www.npra.gov.bh లో చూడండి లేదా నెంబర్:17399764 కు కాల్ చెయ్యండి.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్ల ట్రయల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- ఏపీ ప్రజలకు విశాఖ AIG గుడ్ న్యూస్
- విద్యార్థులపై అరాచకాలకు పాల్పడిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: CJI
- శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
- ప్రధాని మోదీ వీడియో నిలిపివేత: కేంద్ర ప్రభుత్వానికి మెటా క్షమాపణలు!
- డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడితే భారీ జరిమానా..
- ప్రధాని మోదీతో స్కైరూట్ ఫౌండర్లు భేటీ: ‘విక్రమ్-1’ విజయవంతంపై ప్రశంసల వర్షం!
- ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్
- ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!







