దుబాయ్‌లో మృతి చెందిన భారత వ్యాపారవేత్త ఛోయిత్‌రామ్
- May 11, 2020
దుబాయ్:జీబీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ జి.బి. చోయిత్‌రామ్ దుబాయ్‌లో తుది శ్వాస విడిచారు. 66 ఏళ్ళుగా దుబాయ్‌లో నివసిస్తున్నారు చోయిత్‌రామ్. ఆయన వయసు 90 సంవత్సరాలు. దుబాయ్ ఇండియన్ అసోసియేషన్ అలాగే ఇండియన్ స్పోర్ట్స్ క్లబ్‌కి గతంలో ప్రెసిడెంట్‌గా పనిచేశారాయన. ఇండియన్ హై స్కూల్ దుబాయ్‌కి ట్రస్టీగా కూడా వ్యవహరించారు. దుబాయ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్‌లో కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. జిబి చోయిత్‌రామ్ కి దీపక్ చోయిత్‌రామ్ జెత్వానీ, గిరీష్ చోయిత్‌రామ్ జెత్వానీ అనే ఇద్దరు కుమారులున్నారు. నలుగురు కుమార్తెలూ వున్నారాయనకు. దుబాయ్‌లో 1950లో వ్యాపార కార్యకలాపాల్ని జిబి చోయిత్‌రామ్ ప్రారంభించారు. దుబాయ్, బహ్రెయిన్ మరియు కువైట్‌లకు జిబి కుటుంబ సభ్యులు టెక్స్‌టైల్స్ ఎక్స్‌పోర్టర్స్‌గా పనిచేశారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







