షాప్‌లలో ప్రవేశానికి మాస్క్ తప్పనిసరి
- May 12, 2020
మస్కట్: షాపింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్లోకి ఎవరైనా ప్రవేశించాలంటే ఖచ్చితంగా మాస్క్ ధరించాల్సిందే. అలాగే థర్మల్ స్కానింగ్‌ని కూడా తప్పనిసరి చేసినట్లు మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. ఓ వ్యక్తి శరీర ఉష్ణోగ్రత 37.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా వుంటే, మాల్స్‌లోకి ప్రవేశం నిషిద్ధం. పిల్లల్ని కూడా షాపుల్లోకి అనుమతించరు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా, షాపింగ్ సెంటర్స్, మాల్స్ అన్ని రకాలైన ట్రాలీలనూ ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాల్సి వుంటుంది. 2 మీటర్ల దూరం వ్యక్తుల మధ్య వుండేలా చర్యలు తీసుకోవాలి. ఉద్యోగుల భద్రత విషయంలోనూ నిర్వాహకులే తగిన జాగ్రత్తలు చేపట్టాల్సి వుంటుంది. ఒకవేళ నిబంధనల్ని ఉల్లంఘిస్తే 500 ఒమన్ రియాల్స్ జరీమానా విదిస్తారు. మూడు రోజులపాటు ఆయా ఎస్టాబ్లిష్మెంట్స్ని మూసివేయడం కూడా జరుగుతుంది. రిపీట్ అయితే 2,000 ఒమన్ రియాల్జ్ జరీమానా 10 రోజులపాటు షాప్ మూసివేత జరుగుతుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







