మస్కట్ స్వయంగా ముఖకవచ తయారీ

- May 14, 2020 , by Maagulf
మస్కట్ స్వయంగా ముఖకవచ తయారీ

మస్కట్:కరోనా వ్యాధి గ్రస్తులకు చికిత్స అందించే ఆరోగ్య కార్యకర్తలు ముఖానికి ధరించే మాస్క్ లను మస్కట్ హయ్యర్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ స్వయంగా తయారు చేసింది. వీటిని ఒకసారి వాడిన తర్వాత పారవేస్తారు. ఇలాంటివి తాము 6500 తయారు చేశామని సంస్థ కాస్ట్యూమ్స్ విభాగ అధిపతి సల్వా బింట్ సుల్తాన్ అల్ హబ్సిఆహ్ ప్రకటించారు. కరోనా వైరస్ నేపధ్యంలో ఆరోగ్య మంత్రిత్వశాఖ అవసరాన్ని గుర్తించి వీటిని తయారు చేశామన్నారు. సరైన ముఖ రక్షణ కవచాలకు తయారు చేయడానికి రోజుకు 12 మంది స్వచ్ఛంద కార్యకర్తల సేవలను వినియోగించుకున్నామన్నారు. ఇకపై ముఖకవచ తయారీ సంఖ్యను పెంచి 10000 మంది ఆరోగ్య కార్యకర్తలకు అందిస్తామన్నారు.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com