'వందేభారత్ మిషన్ లో మరో ముందడుగు'
- May 14, 2020
ఢిల్లీ:"కరోనా మహమ్మారి కారణంగా సమస్యలు ఎదుర్కొంటూ విదేశాల్లో నివసిస్తున్న భారతీయులను తిరిగి తెచ్చుకుంటాం. విమానాలకు కొదవలేదు. ఎన్నాయినా పంపుతాం. వందేభారత్ మిషన్ లో మొదటి భాగం ఈ నెల 15 వ తేదీతో ముగుస్తుంది. 16 వ తేదీ నుంచి 31 దేశాలలో నివసిస్తున్న భారతీయులను వెనక్కి తేవడానికి 105 విమాన సర్వీసులు ఉంటాయి. ఈ కార్యక్రమం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఎయిర్ ఇండియా తో కలిసి చేపట్టనుంది" అని కేంద్రమంత్రి వి.మురళీధరన్ ఢిల్లీలో గురువారం మీడియా తో అన్నారు.
తొలిదశ వందేభారత్ మిషన్ లో భాగంగా మొత్తం 14 వేలమంది తిరిగి రానున్నారు.
సౌదీ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయులను గురించి మాట్లాడుతూ.. వేలాది మంది తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఒక్క కేరళ రాష్ట్రానికే చెందిన వారు గల్ఫ్ లోని 6 ప్రాంతాల్లోనూ నివసిస్తున్నారు. వారిలో ఎక్కువ శాతం మంది తిరిగి రావడానికి ఇష్టపడుతున్నారన్నారు. ఒక్కొక్క ప్రాంతానికి విమానం కేటాయించిన 6 విమానాలు అవుతాయన్నారు. రద్దీలేకుండా చేయడానికి ప్రత్యేకంగా కేరళకు168 సర్వీసులు నడపడానికి కేంద్రం సిద్ధమని మంత్రి ప్రకటించారు. అయితే కేరళ ప్రభుత్వం వైద్య పరీక్షలు నిర్వహించి, క్వారంటాయిన్ సెంటర్ల ఏర్పాటుకు సంసిద్ధత ప్రకటించాలన్నారు.
అనర్హులకు సీట్లు కేటాయింపు వంటి అవకతవకలపై వచ్చిన ఫిర్యాదులు నిరూపితమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉచితంగా లేదా తక్కువ చార్జీలతో భారత్ కు తీసుకురావడానికి ఏ విమానయాన సంస్థ ముందుకు రాలేదన్నారు. అయితే గల్ఫ్ లోని కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను పంపడానికి చార్జీలు ఇవ్వడానికి ముందుకు వచ్చావని తెలిపారు. ఉద్యోగులు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు కావడంతో.. ఆచరణలో ఎంతవరకు సాధ్యమో పరిశీలిస్తున్నామన్నారు.
ప్రత్యేక విమానానికి అభ్యంతరం లేదన్నారు. కువైట్ నుంచి ఆమ్నెస్టీ కి సంబంధించిన వ్యవహారం పరిశీలనలో ఉందన్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







