కరోనా నిర్మూలనకై 'BAPS' ప్రార్థనలు
- May 15, 2020
యూఏఈ:"మానవ మేధస్సుతో కట్టడికి సాధ్యంగాని ప్రకృతి విలయాన్ని నిరోధించడానికి దైవకృప అవసరం. కొన్ని మానవాతీత శక్తులు సహకరిస్తే.. ఎంతటి అపాయాన్నైనా ఉపాయంతో ఎదుర్కొనవచ్చు. అయితే దీనికి దైవకృప అవసరం. మానవులుగా మనం చేయాలసింది దైవ ప్రార్ధన. భగవంతుడు కరుణకి ఆ ఆపద నుంచి సులువుగా, త్వరగా బయట పడవచ్చు."
ఇది నిరూపించడానికి బొచ్చా సంవాసీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయన్ సంస్థ(BAPS).. స్థానిక మానవ కూటమి ఉన్నత కమిటీ (H.C.H.F) తో కలిసి ఆధ్యాత్మిక, ప్రార్థన కార్యక్రమం నిర్వహించింది. కార్యక్రమాన్ని స్వామి నారాయణ్ సంస్థ అబుదాభి శాఖ అధ్యక్షులు పూజ్య బ్రహ్మ విహారీ స్వామి ముందుండి నిర్వహించారు.సుమారు 1000 కి పైగా కుటుంబాలతో పాటు దాదాపు 5 వేల మంది ఆఫ్రికా, యూకే, యు.ఎస్, ఆస్ట్రేలియా, భారత్, గల్ఫ్ దేశాలు ఆన్ లైన్ ప్రార్థన చేశాయి. మానవ సంక్షేమం కోసం ఈ ప్రార్ధన చేశారు. prayer.mandir.ae ద్వారా ఈ ప్రార్థన జరిపారు.
ఈ సందర్భంగా స్వామి నారాయణ సంస్థ ఆధ్యాత్మిక గురు పూజ్య మహంత్ స్వామి మహరాజ్ మాట్లాడుతూ ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో వివిధ ప్రభుత్వాలను, కార్యకర్తలను అభినందించారు. సంబంధించిన శాఖలన్నీ వ్యక్తిగత జీవితం పణంగా పెట్టాయని, ప్రభుత్వ ఆదేశాలను మనం ఆచరించాలన్నారు. లాక్ డౌన్ ఆచరించడం వల్ల తమను, తమ కుటుంబం, సమాజం తద్వారా దేశాన్ని సంరక్షణ చేయవచ్చని తెలిపారు. ప్రసంగం ముగించే ముందు ప్రపంచం కరోనా నుంచి బయట పడాలని ప్రార్ధన చేశారు.
అనంతరం పూజ్య బ్రహ్మవిహారి స్వామీజీ మాట్లాడుతూ కోవిడ్ 19 క్రిమి ని అరికట్టేందుకు యూఏఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. ఒక్క పిలుపుతో వేల మంది స్పందించారని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగితే ప్రపంచం మొత్తం కలిసి దైవ ప్రార్ధన చేయవచ్చన్నారు. యజుర్వేదం లో పేర్కొన్నట్లు 'కేవలం మానవుల కోసం ప్రార్ధన కాదు. సర్వ జగత్ కోసం ప్రార్ధన చేయాలి' అని ఉటంకించారు. స్వామి నారాయణ్ ప్రముఖ్ చెప్పిన ప్రకారం.. ఇతరుల సంతోషం మనలోనే చూసుకోవాలని, కనుక అందరూ కలిసి నివసించాలన్న సూత్రాన్ని అనుసరించాలన్నారు.
కార్యక్రమంలో భాగంగా భారతీయ ఉపఖండం కు చెందిన పలువురు తమతమ భాషల్లో దైవ గీతాలాపన చేశారు. అబుదాభి ఒరియా సమాజ్ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ రథ్, మరాఠీ లో రవి కలే, మలయాళం లో శివకుమార్ తదితరులు ప్రార్ధనా గీతాలు ఆలపించారు. ఈ గీతాలు అందరికీ అర్థమవడానికి ఆంగ్లంలో పదాలను ప్రదర్శించారు. చివరగా ఇస్కాన్ యువబృందం గీతాలాపన అలరించింది.

తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







