కువైట్:పూర్తి కర్ఫ్యూ విధించటంతో మహబౌలా,జ్లీబ్ ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాల తొలగింపు
- May 16, 2020
కువైట్:జ్లీబ్ అల్ షయౌఖ్, మహబౌలా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సెక్యూరిటీ చెక్ పాయింట్స్ అన్నింటిని అధికారులు తొలగించారు. దేశమంతా పూర్తి స్థాయి కర్ఫ్యూ విధించటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే..కరోనా వ్యప్తి నివారణలో భాగంగా జ్లీబ్, మహబౌలా ప్రాంతాల్లో గత నెలలోనే పూర్తిగా కర్ఫ్యూ విధించారు. దీంతో ఆయా నగరాల్లోకి ఇతర ప్రాంతాల వారు రాకుండా..ఆ నగరాల ప్రజలకు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి తనఖీలు చేపట్టారు. కానీ, కరోనా తీవ్రత పెరగటంతో దేశమంతా పూర్తిస్థాయిలో కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తర్వాత వాహనాల తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం లేకపోవటంతో చెక్ పాయింట్లను తొలగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
నిషేధాజ్ఞాలు రద్దు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న తర్వాతే మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అధికారులు చెబుతున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







