మే 31 వరకూ లాక్డౌన్ పొడిగింపు
- May 17, 2020
ఢిల్లీ:కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌పై భారత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.భారత దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31 వరకూ పొడిగించింది. దీనికి సంబంధించి మరికాసేపట్లో మార్గదర్శకాలు జారీ చేయనుంది. కాగా నాలుగో విడత లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా పలు రాష్ట్రాలు భారీ సడలింపులను ప్రకటించనున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులు అధికంగా ఉంటాయని భావిస్తున్నారు.
ఇక లాక్డౌన్ 4.0 మార్గదర్శకాలపై కేంద్రం ఎలాంటి నిబంధనలతో ముందుకొస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇక లాక్డౌన్ మార్గదర్శకాలపై రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, హోం శాఖ కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. రాత్రి 9 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాలుగో విడత లాక్డౌన్ అమలుపై సంప్రదింపులు జరుపుతారు. ఈ సమావేశం తర్వాత లాక్డౌన్ నిబంధనలు, సడలింపులపై మార్గదర్శకాలను విడుదల చేస్తారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు