సౌదీ మాస్క్‌లో ఆత్మాహుతి దాడి నలుగురి మృతి

- January 29, 2016 , by Maagulf
సౌదీ మాస్క్‌లో ఆత్మాహుతి దాడి నలుగురి మృతి

తూర్పు సౌదీ అరేబియాలోని ఓ మాస్క్‌లో శుక్రవారం ప్రార్ధనలు జరుగుతన్న సమయంలో ఓ ఆత్మాహుతి దాడి జరిగింది. తనతోపాటు తెచ్చుకున్న బాంబును పేల్చుకున్నాడో వ్యక్తి. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణంపాలయ్యారు. అంతకు ముందు ఆ వ్యక్తి విచక్షణా రహితంగా ప్రార్ధనలు జరుపుతున్నవారిపై కాల్పులు జరిపాడు. అతన్నుంచి తప్పించుకునే ప్రయత్నం కొందరు చేయగా, మరికొందరు మసీదులో ఉన్నవారు దుండగుడ్ని పట్టుకునేందుకు ప్రధాన ద్వారం దగ్గరకు చేరుకోగా, అడ్డగించిన దుండగుడు తనను తాను పేల్చేసుకున్నాడు. అయితే ఇద్దరు వ్యక్తులు మసీదులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినప్పుడు భద్రతా సిబ్బంది వారిని నిలువరించారని, వారిరువురూ కాల్పులు జరిపారనీ, తప్పించుకునే అవకాశం లేకపోవడంతో దుండగులు తమను తాము పేల్చేసుకున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com