సౌదీ అరేబియాలో ఉబెర్ మెడిక్స్ ప్రారంభం
- May 19, 2020
రియాద్: ఉబెర్ సంస్థ, ఉబెర్ మెడిక్స్ని సౌదీ అరేబియాలో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్ నేపథ్యంలో హెల్త్ కేర్ వర్కర్స్‌కి డిస్కౌంటెడ్ ట్రిప్స్ అందిస్తున్నట్లు పేర్కొంది ఉబెర్ సంస్థ. రియాద్, జెడ్డా అలాగే ఈస్ట్ ప్రావిన్స్‌లోని హెన్త కేర్ వర్కర్స్, తమ ఉబెర్ ట్రిప్స్ ద్వారా 25 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఉబెర్ మెడిక్స్ ద్వారా సేఫ్‌గా గమ్యస్థానం చేరుకోవచ్చని ఈ సందర్భంగా సంస్థ పేర్కొంది. ఉబెర్ సంస్థకి సౌదీ అరేబియా జనరల్ మేనేజర్ అయిన మొహమ్మద్ గజాజ్ మాట్లాడుతూ, ఇంటింటికీ వెళ్ళి సేవలు అందిస్తోన్న హెల్త్ కేర్ వర్కర్స్ పాత్ర చాలా ముఖ్యమైదనీ, ఈ నేపథ్యంలో వారికి డిస్కౌంట్‌తోపాటు భద్రతతో కూడిన ప్రయాణాన్ని తాము అందిస్తున్నామని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో తమవంతుగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







