బహ్రెయిన్:నలుగురు మహిళలను బంధించిన ఇద్దరు అసియా వ్యక్తులు అరెస్ట్
- May 19, 2020
మనామా:బహ్రెయిన్ పోలీసులు అసియా దేశాలకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. అసియా దేశాలకే చెందిన నలుగురు మహిళలను బంధించి..వారిని అసభ్య కార్యాకలాపాల్లో పాల్గొనాల్సిందిగా వేధిస్తున్నారనే ఫిర్యాదుతో ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి న్యాయ విచారణకు తరలించారు. నేరపరిశోధన, ఫోరెన్సిక్ సైన్స్ విభాగం డీజీ బ్రిగేడియర్ అబ్ధల్లాజీజ్ అల్ రుమైహి తెలిపిన వివరాల ప్రకారం..అసియా దేశాలకు చెందిన రాయబార కార్యాలయం నుంచి తమకు సమాచారం అందిన 12 నిమిషాల్లోనే చర్యలు తీసుకున్నామన్నారు. బాధితులు ఉన్న ప్రాంతానికి వెళ్లి నలుగురు మహిళలను విడిపించటంతో పాటు..నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇదిలాఉంటే మరో కేసులో ఇద్దరు అసియన్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గుదైబియా ప్రాంతంలో నకిలీ మద్యం తయారు చేస్తున్నందుకు వారిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మద్యం తయారు చేసే పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







