కర్‌ఫ్యూ పర్మిట్స్‌: అవసరమైన డేటా అందించాల్సిందే

- May 19, 2020 , by Maagulf
కర్‌ఫ్యూ పర్మిట్స్‌: అవసరమైన డేటా అందించాల్సిందే

కువైట్:కర్‌ఫ్యూ పర్మిట్స్‌ కావాలనుకునేవారు పూర్తి డేటాను అందించాలని మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ స్పష్టం చేసింది. డాక్టర్‌ని కలిసేందుకు వెళ్ళే క్రమంలో పర్మిట్స్‌ పొందేవారు అందుకు తగ్గ వివరాల్ని పర్మిట్‌ అప్లికేషన్‌లో పొందుపర్చాల్సి వుంటుంది. ఆన్‌లైన్‌ ద్వారా ఈ మేరకు వివరాలు పొందుపర్చాలని, సంబంధిత వెబ్‌సైట్‌ (https://curfew.paci.gov.kw.) వివరాల్ని పేర్కొంది. హాస్పిటల్‌ లేదా క్లినిక్‌ వద్ద పర్మిట్‌ లెటర్‌ని సమర్పించాల్సి వుంటుందనీ, మరోసారి వెళ్ళాల్సి వస్తే.. దానికి సంబంధించిన వివరాల్ని కూడా ప్రస్తావించాలని మినిస్ట్రీ తెలిపింది. యాక్చువల్‌ డెస్టినేషన్‌తో పర్మిట్‌లోని డెస్టినేషన్‌ మ్యాచ్‌ అవకపోతే, ఆ వ్యక్తికి జారీ చేసిన పర్మిట్‌ని వెనక్కి తీసుకుంటారు. మే 10 నుంచి 30వ తేదీ వరకు కర్‌ఫ్యూని కువైట్‌ ప్రకటించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com