టిక్‌టాక్ బ్యాన్ చేయమంటూ:రేఖా శర్మ
- May 19, 2020
ఢిల్లీ:టిక్‌టాక్ బ్యాన్ చేస్తే గుండె లబ్‌డబ్ మని కొట్టుకోవడం ఆగిపోతుందేమో.. పొద్దున్న లేస్తే అదే పని మీద ఉండే మహానుభావులకి. ఏదైనా కొంత వరకు బాగానే ఉంటుంది. హద్దు మీరితేనే వెగటు పుడుతుంది. చైనా ప్రవేశపెట్టిన టిక్‌టాక్‌కి ప్రపంచమంతా బానిసైంది. దీని ద్వారా కోట్ల రూపాయల బిజినెస్ చేస్తోంది చైనా. అయితే అందులో అందె వేసిన చేయి మాత్రం భారత్‌దే. అత్యధికంగా ఉపయోగిస్తున్నది భారతీయులే అని ఓ సర్వేలో తేలింది.
టిక్‌టాక్ వీడియోలు అసభ్యకరంగా ఉంటున్నాయని జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ ధ్వజమెత్తారు. టిక్‌టాక్‌ను పూర్తి నిషేధించాలని కేంద్రప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు ఆమె తెలిపారు. సరదా కోసం సృష్టించిన టిక్‌టాక్‌లో అత్యాచార వీడియోలు, యాసిడ్ దాడులను ప్రోత్సహించే విధంగా వీడియోలు చేస్తున్నారని బీజేపీ నాయకుడు తాజిందర్ సింగ్ బగ్గా ట్వీట్‌పై ఆమె స్పందించారు. టిక్‌టాక్ కంటెంట్ క్రియేటర్ ఫైజల్ సిద్ధిఖీ అభ్యంతరకరమైన వీడియోలను పోస్ట్ చేస్తుంటాడు. అవి చూసే అతడి ఫాలోవర్ల సంఖ్య 13,4 మిలియన్లకు చేరుకుంది.
ఏదైనా చెడు ఎక్కినంత త్వరగా మంచి ఎక్కదు. చెత్త వీడియోలకే షేర్లు, లైకులు చేస్తుంటారు. సోషల్ మీడియాలో పాపులర్ అవుతుంటారు. ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్న విషయం మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. అతడిపై చర్యలు తీసుకోవాలని కమిషన్ మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. అతడు పెట్టిన పోస్ట్‌ను కూడా వెంటనే తొలగించాలని ఎన్‌సీడబ్ల్యూ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







