ఇంటి వద్దనే ఈద్‌ ప్రార్థనలు నిర్వహించుకోవాలి

- May 19, 2020 , by Maagulf
ఇంటి వద్దనే ఈద్‌ ప్రార్థనలు నిర్వహించుకోవాలి

కువైట్‌:కువైట్‌ మినిస్ట్రీ ఆఫ్‌ అవ్‌కాఫ్‌, ఈద్‌ అల్‌ పితర్‌ ప్రార్థనల్ని ఇంటివద్దనే చేసుకోవాలని సూచించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో మాస్క్‌ల వద్ద ప్రార్థనలు చేయడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ పరిగణనలోకి తీసుకోవాలని మినిస్ట్రీ సూచించింది. మినిస్ట్రీ ఈ మేరకు ఫోన్‌ ద్వారా పలువురు ముస్లిం స్కాలర్స్‌ అభిప్రాయాల్ని తెలుసుకుంది. వారంతా రక్‌ ఆతిన్‌ ప్రేయర్స్‌ ఇంటి వద్దనే నిర్వహించుకోవడానికి సమ్మతి తెలిపారని మినిస్ట్రీకి చెందిన ఫత్వా డిపార్ట్‌మెంట్‌ తెలిపింది. కుటుంబ సభ్యులతో కలిసి ఈ ప్రత్యేక ప్రార్థనల్ని ఇంటివద్దనే నిర్వహించుకోవాలని మినిస్ట్రీ విజ్ఞప్తి చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com