పసుపుగా వస్తున్న పొగకు బెంబేలెత్తిన విశాఖ ప్రజలు
- May 21, 2020
విశాఖ: నగరంలో మళ్లీ కలకలం రేగింది. HPCL కంపెనీ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. పసుపుగా పొగ రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చారు. HPCL రిఫైనరీలోని ఎస్‌హెచ్‌యూని తెరిచే సమయంలో ఘటన జరిగింది. ఎలాంటి ప్రమాదం లేదని HPCL వర్గాలు అంటున్నాయి.
ఇటీవలే ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుండి స్టైరిన్ గ్యాస్ లీక్ అయ్యి 12 మంది చనిపోయారు. పలువురు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఈ ఘటనలో చిన్నారులు కూడా అస్వస్థకు గురయ్యారు. వీరందరికీ ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. కొంతమంది డిస్చార్జ్ అయ్యారు. ఈ ఘటన నుంచి కోలుకోకముందే మళ్ళీ HPCL కంపెనీ నుంచి ఒక్కసారిగా పొగ రావటంతో విశాఖ ప్రజలు బెంబేలెత్తిపోయారు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







