రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రాహుల్ నివాళి
- May 21, 2020
న్యూఢిల్లీ : నిజమైన దేశభక్తుడికి కుమారుడిగా జన్మించినందుకు గర్విస్తున్నానని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ అన్నారు. నేడు తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి సందర్భంగా రాహుల్ ఆయనకు నివాళులర్పించారు. ఈ మేరకు రాహుల్ ట్విటర్‌లో ఓ పోస్ట్ చేశారు. 'నిజమైన దేశభక్తుడు, ఉదారవాది, పరోపకారి అయిన తండ్రికి కొడుకు అయినందుకు గర్విస్తున్నాను. ప్రధాన మంత్రిగా రాజీవ్ గారు దేశాన్ని ప్రగతి పథంలోకి నడిపించారు. తన దూరదృష్టితో దేశాన్ని శక్తివంతం చేయడానికి అనేక చర్యలు చేపట్టారు. ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా.. అప్యాయతతో, కృతజ్ఞతతో ఆయనకు నమస్కరిస్తున్నాను' అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ కూడా ట్విటర్ వేదికగా రాజీవ్ గాంధీ కి నివాళులర్పించింది. రాజీవ్‌కు సంబంధించిన ఓ చిన్న వీడియో పోస్ట్ చేసింది. 'యువ భారతం నాడీ తెలిసి వ్యక్తి. మనల్ని ఉజ్వలైన భవిష్యత్తు వైపు నడిపించిన వ్యక్తి. యువత, వృద్ధుల అవసరాలను అర్థం చేసుకున్న వ్యక్తి.. అంతేకాకుండా అందరిచేత ప్రేమించబడ్డ వ్యక్తి' అని పేర్కొంది. మరోవైపు రాజీవ్ వర్ధంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు నివాళులర్పిస్తున్నాయి.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







