‘సోలో బ్రతుకే సో బెటర్’లో విడుదలైన వీడియో సాంగ్ ‘నో పెళ్లి..’
- May 25, 2020
సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం `సోలో బ్రతుకే సో బెటర్`. సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నభా నటేశ్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో తొలి వీడియో సాంగ్ ‘నో పెళ్లి..’ను యువ కథానాయకుడు నితిన్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ సాంగ్‌లో సాయితేజ్‌తో పాటు వరుణ్‌తేజ్, రానా కూడా సందడి చేయడం విశేషం.
సాంగ్ విడుదల చేసిన తర్వాత ‘‘సాయితేజ్ ఇచ్చిన గిఫ్ట్ చాలా బావుంది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ సాంగ్‌ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. అయితే నువ్వెన్ని రోజులు సింగిల్‌గా ఉంటావో చూస్తాను. కొన్నిసార్లు చేసుకోవడంలో టైమ్ గ్యాప్ ఉంటుందేమో కానీ,చేసుకోవడం మాత్రం పక్కా’’ అని నితిన్ తెలిపారు.
‘‘ఈ సాంగ్‌లో భాగం కావడం చాలా ఫన్‌గా అనిపించింది’’ అని వరుణ్ తేజ్ తెలిపారు.
‘‘నా యూత్‌లో టంగ్ స్లిప్ అనొచ్చు సాయితేజ్’’ అని రానా అన్నారు.
మ్యూజికల్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించిన ఈ పాటను రఘురామ్ రాయగా.. అర్మాన్ మాలిక్ పాటను పాడారు. త్వరలోనే ఈ సినిమా విడుదలపై నిర్మాతలు అధికారిక ప్రకటన చేస్తారు. ఈ చిత్రానికి వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నటీనటులు:
సాయితేజ్, నభా నటేశ్ తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: సుబ్బు
నిర్మాత: బీవీఎస్ఎన్.ప్రసాద్
ఆర్ట్: అవినాష్ కొల్ల
ఎడిటర్: నవీన్ నూలి
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: వెంకట్ సి.దిలీప్
పి.ఆర్.ఒ: వంశీ కాకా
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







