'నాంది' డబ్బింగ్ ప్రారంభం
- May 25, 2020
అల్లరి నరేష్ హీరోగా ఎస్‌వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఇంటెన్స్ ఫిల్మ్ 'నాంది' డబ్బింగ్ పనులు రంజాన్ పర్వదినం సందర్భంగా సోమవారం మొదలయ్యాయి. విజయ్ కనకమేడల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 'ఎ న్యూ బిగినింగ్' అనేది ఈ సినిమాకు ఉపశీర్షిక.
సామాజిక అంశాల మేళవింపుతో, క్రైమ్ థ్రిల్లర్ ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రమిది. అల్లరి నరేష్ కామెడీ శైలికి పూర్తి భిన్నంగా వినూత్న కథ, కథనాలతో రూపుదిద్దుకుంటోంది. ఇది అల్లరి నరేశ్ నటిస్తోన్న 57వ చిత్రం. ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగే ఈ భిన్న తరహా చిత్రానికి అబ్బూరి రవి, చోటా కె. ప్రసాద్, శ్రీచరణ్ పాకాల, బ్రహ్మ కడలి వంటి ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.
వరలక్ష్మీ శరత్‌కుమార్, హరీష్ ఉత్తమన్, ప్రియదర్శి, ప్రవీణ్ కీలక పాత్రధారులైన ఈ చిత్రానికి సంభాషణలు: అబ్బూరి రవి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఛాయాగ్రహణం: సిధ్, ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్, కళ: బ‌్రహ్మ కడలి.
తాజా వార్తలు
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!