కోవిడ్-19 లాక్‌డౌన్ నుంచి సడలింపులు
- May 26, 2020
జెడ్డా: సౌదీ అరేబియా, గురువారం నుంచి కోవిడ్19 లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఇవ్వనుంది. అయితే, వెంటనే ఎక్కువ సడలింపులు ఆశించవద్దనీ క్రమక్రమంగా మాత్రమే సడలింపులు వుంటాయని హెల్త్ మినిస్టర్ డాక్టర్ తావ్‌ఫిక్ అల్ రబియా చెప్పారు. గురువారం ఓ ఫేజ్‌లోంచి ఇంకో ఫేజ్‌లోకి వెళ్ళబోతున్నామని ఈ సందర్భంగా ఆయన వివరించారు. సోషల్ డిస్టెన్సింగ్ మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందేనని ఆయన సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యమని అన్నారాయన. ఈ విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజలంతా ఒక్కటై ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు మినిస్టర్ ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 74,795గా వుంది. వీటిల్లో 28,728 యాక్టివ్ కేసులు కాగా, 45,668 మంది కోలుకున్నారు. మొత్తం 399 మంది దేశంలో కరోనాతో మృతి చెందారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







