హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ ట్రయల్‌ నిలిపివేసిన WHO

- May 26, 2020 , by Maagulf
హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ ట్రయల్‌ నిలిపివేసిన WHO

హెడ్రాక్సీక్లోరోక్విన్...కరోనాను జయించే దివ్యౌషధం అన్నారు.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అయితే ఏకంగా తాను ఆ మందులనే వాడుతున్నానని, ఆ మందు రక్షణ రేఖ అని వ్యాఖ్యానించారు. ఈ మందు కోసం ప్రపంచ దేశాలు భారత్ చేయి చాచాయి. అయితే తాత్కాలికంగా హైడ్రాక్సీక్లోరోక్వీన్ క్లినికల్ ట్రయల్స్‌ను నిలిపివేసినట్లు WHO పేర్కొన్నది. కోవిడ్ రోగులకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఇవ్వడం వల్ల ప్రాణాంతకంగా మారుతున్నట్లు ద ల్యాన్సెట్ తన రిపోర్ట్‌లో పేర్కొన్నట్లు WHO డైరక్టర్ జనరల్ టెడ్రోస్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలను వాడడం నిలిపేసినట్లు ఆయన చెప్పారు. హెచ్‌సీక్యూ వినియోగంపై డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డు సమీక్షిస్తున్నదని, దీనిలో భాగంగానే ఆ మాత్రలను వాడడం లేదని టెడ్రోస్ తెలిపారు. హైడ్రాక్సీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ద ల్యాన్సెట్ తన కథనంలో పేర్కొన్నది. హైడ్రాక్సీక్లోరోక్వీన్‌, క్లోరోక్వీన్ లాంటి మందులను కేవలం మలేరియా పేషెంట్లు వాడాలని టెడ్రోస్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com