మే 31 నుంచి సౌదీ అరేబియాలో డొమెస్టిక్ విమానాలు
- May 27, 2020
రియాద్: సౌదీ అరేబియా ఆదివారం (మే 31) నుంచి డొమెస్టిక్ విమానాలకు అనుమతినివ్వనుంది. లాక్డౌన్ నేపథ్యంలో డొమెస్టిక్, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం విదితమే. కాగా, క్రమక్రమంగా సౌదీ అరేబియాలో లాక్డౌన్ నుంచి వివిధ రంగాలకు మినహాయింపులు లభిస్తున్నాయి. ఈ క్రమంలోనే డొమెస్టిక్ విమానాలు తిరిగేందుకు పరిస్థితులు అనుకూలిస్తున్నట్లు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (జిఎసిఎ) పేర్కొంది. డొమెస్టిక్ విమానాలకు అనుమతి లభించినప్పటికీ, కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని విమానాల్ని నడపనున్నట్లు జిఎసిఎ పేర్కొంది. మొత్తం 11 విమానాశ్రయాల్లో మాత్రమే విమానాల రాకపోకలకు అనుమతిస్తారు. రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా, కాసిమ్, అభా, తబుక్, జజాన్, హయిల్, అల్ బాహా మరియు నజ్రాన్ విమానాశ్రయాలు ఇందులో వున్నాయి. మార్చి 21 నుంచి డొమెస్టిక్ విమానాలు సౌదీ అరేబియాలో రద్దయ్యాయి.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







