కువైట్:ధరల నియంత్రణకు షాపులు, సూపర్ మార్కెట్లపై వాణిజ్య మంత్రిత్వ శాఖ నిఘా

- May 27, 2020 , by Maagulf
కువైట్:ధరల నియంత్రణకు షాపులు, సూపర్ మార్కెట్లపై వాణిజ్య మంత్రిత్వ శాఖ నిఘా

కువైట్:ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వినియోగదారుల హక్కులను రక్షించేందుకు కువైట్ పారిశ్రామిక, వాణిజ్య మంత్రిత్వ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. షాపులు, సూపర్ మార్కెట్లు, ఫార్మసీలపై నిఘా పెంచింది. అలాగే 64 కోఆపరేటివీస్, 74 ఫుడ్ కేటరింగ్ ల సేవలను కూడా పర్యవేక్షిస్తోంది. ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతూ వినియోగదారులకు సరుకుల సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. అంతేకాదు..ఫుడ్ డెలివరీ, సరుకుల సరఫరాలో ఎలాంటి నిర్లక్ష్యం చేసిన ఉపేక్షించబోమని హెచ్చరించిన అధికారులు..డెలివరీ సమయంలో కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలు ఎంతవరకు పాటిస్తున్నారో కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటివరకు హాట్ లైన్ 135 ద్వారా 277 ఫిర్యాదులు అందాయని..ప్రస్తుత విపత్కర పరిస్థితులను ఆసరాగా చేసుకొని ప్రయోజనం పొందాలని దురాశపడే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com