కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టం తేవాలి--రాహుల్
- January 30, 2016
దేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టం తీసుకరావాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. హెచ్సీయూలో కొనసాగుతున్న ఉద్యమాన్ని అఖిల భారత స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని విద్యార్థి జేఏసీ నిర్ణయించింది. ఆత్మహత్య చేసుకున్న రోహిత్ జన్మదినమైన 30వ తేదీ నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని భావించింది. రోహిత్ ఆత్మహత్యకు సంతాపంగా, సామాజిక న్యాయాన్ని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఒక రోజు మహాదీక్ష నిర్వహించారు. ఈ దీక్షల్లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ శుక్రవారం అర్ధరాత్రి హెచ్ సీయూకు చేరుకున్నారు. అక్కడ జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. శనివారం సాయంత్రం వరకు ఈ దీక్షలు కొనసాగాయి.అనంతరం ప్రొ. కంచె ఐలయ్య నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింప చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉద్ధేశించి రాహుల్ ప్రసంగించారు. తాను ఇక్కడకు ఎందుకు వచ్చారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారని, దేశంలో మరే విద్యార్థి ఇలాంటి వత్తిడితో ఆత్మహత్యకు పాల్పకూడదనే ఉద్ధేశ్యంతో తాను రావడం జరిగిందన్నారు. బీజేపీ తన భావజాలాన్ని ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నిస్తోందని, యూనివర్సిటీల్లో వివక్ష ఉంటే దేశం ముందుకు సాగదని స్పష్టం చేశారు. గతంలో గాంధీకి జరిగిన అవమానం లాంటిదే రోహిత్ కు జరిగిందన్నారు. రోహిత్ ఒంటరి వాడు కాదని దేశంలో రోహిత్ లాంటి వ్యక్తులు చాలా మందే ఉన్నారని, రోహిత్ కు జరిగిన అవమానం దేశంలో ఇంకా ఎవరికైనా జరగవచ్చన్నారు. వివక్షకు వ్యతిరేకంగా చట్టం తీసుకరాకుంటే తాము పోరాటానికి వెనుకాడమని, ప్రజాస్వామ్యాన్ని భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదని రాహుల్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









