9మంది వైద్యుల కాల్చివేత...
- May 29, 2020
సోమాలియా:అనారోగ్యంతో బాధపడే ఎంతో మందికి ఆపదలో దేవుడిలా చికిత్స అందించే వైద్యుల ప్రాణాలను కూడా ఉగ్రవాదులు కడతేర్చుతున్నారు. తాజాగా సోమాలియాలో జరిగిన ఓ సంఘటన కలకలం రేపుతోంది. అల్‌ఖైదా అనుబంధ సంస్థ అయిన అల్ షబాబ్ గ్రూప్‌కు చెందిన ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. సౌత్ సోమాలియాకు చెందిన ఈ ఉగ్రవాదులు.. తొమ్మిది మంది డాక్టర్లను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత వారిని కాల్చి చంపేశారు. దేశంలోని మిడిల్ షాబెల్లీ ప్రావిన్స్ ప్రాంతంలోని బలాద్ నగరంలో ఈ తొమ్మిది మంది డాక్టర్ల డెడ్ బాడీస్ దర్శనమిచ్చాయి. వీరంతా యువ డాక్టర్లని గుర్తించారు. స్థానిక ఆస్పత్రుల్లో వీరంతా ఉద్యోగం చేసేవారని అధికారులు తెలిపారు.స్థానిక ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







