యూఏఈ ఐకానిక్‌ సెంట్రల్‌ సూక్ లో అగ్ని ప్రమాదం

- May 29, 2020 , by Maagulf
యూఏఈ ఐకానిక్‌ సెంట్రల్‌ సూక్ లో అగ్ని ప్రమాదం

ఐకానిక్‌ షార్జా సెంట్రల్‌ సౌక్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, రికార్డు సమయంలో మంటల్ని అదుపు చేసినట్లు మునిసిపాలిటీ ప్రకటించింది. సెంట్రల్‌ సౌక్‌లోని ఓ ఫుడ్‌ మరియు బెవరేజ్‌ ఔట్‌లెట్‌లో చిన్నపాటి అగ్ని ప్రమాదం సంభవించిందని షార్జా సిటీ మునిసిపాలిటీ పేర్కొంది. సకాలంలో స్పందించడంతో మంటలు వెంటనే అదుపులోకి వచ్చినట్లు తెలిపారు అధికారులు. ప్రమాదం జరిగిన వెంటనే షాపర్స్‌ మరియు షాప్‌ ఓనర్స్‌ ఆ ప్రాంతం నుంచి తరలించబడ్డారు. కేవలం 15 నిమిషాల్లోనే మంటల్ని ఫైర్‌ ఫైటర్స్‌ అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com