అరబిక్ న్యూస్ లో ఆర్జీవీ

- May 30, 2020 , by Maagulf
అరబిక్ న్యూస్ లో ఆర్జీవీ

'కరోనా వైరస్' పై ప్రపంచంలోనే మొట్టమొదటగా సినిమా తీసి సంచలనం సృష్టించిన సుప్రసిద్ధ భారతదేశ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ట్రైలర్ విడుదల చేసారు. 

ఈ ట్రైలర్ గురించి భారతదేశంలోని అన్ని భాషల్లోనూ వార్త విస్తృతంగా కవర్ అయింది. దానికి కారణం ఈ సబ్జెక్ట్ పై ఇదే మొదటి సినిమా కావడం, తీసినవారు ఆర్జీవి కావడం, అమితాబ్ వంటి వారు దీనిపై ట్వీట్ చేయడం. 

అయితే కథ అంతటితో ఆగలేదు. ఈ వార్త ఏకంగా గల్ఫ్ లోని అరబిక్ వెబ్సైట్లలో కూడా తాజాగా దర్శమిస్తోంది.

కరోనావైరస్ ప్రపంచాన్ని కుదుపుతున్న రక్కసి. "కరోనాపై ప్రపంచంలో మొదటి సినిమా" అని ఈ ట్రైలర్లో చెప్పుకున్నట్టుగానే ఇది భారతదేశ సరిహద్దులు దాటి విదేశాల్లో కూడా చక్కర్లు కొడుతోంది. ఇక్కడి అరబిక్ వెబ్సైట్స్ లో కూడా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్న ఈ ట్రైలర్ పై చర్చ జరుగుతోంది. 
ఒకవేళ దీనిని ఓటీటీలో విడుదల చేస్తే అరబిక్ సబ్ టైటిల్స్ కూడా ఉండాలేమో. డబ్బింగ్ అయితే మరీ మంచిది.

--శ్రీకాంత్ చిత్తర్వు(మాగల్ఫ్ చీఫ్-ఎడిటర్,దుబాయ్)

 

https://www.dubaihospitalitynews.com/2020/05/29/99825/

https://www.dubaiglobalnews.com/ar/2020/05/29/153217/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com