కోవిడ్‌పై అసత్య ప్రచారం చేసిన వ్యక్తి అరెస్ట్
- May 30, 2020మనామా:కోవిడ్-19 అసలు లేనే లేదంటూ ఓ వ్యక్తి దుష్ప్రచారం చేస్తున్న దరిమిలా బహ్రెయిన్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కంబాటింగ్ కరప్షన్ అండ్ ఎకనమిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ అందించిన సమాచారం మేరకు విచారణ చేపట్టి, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. తన సోషల్ మీడియా పేజీలో అసలు కోవిడ్19 లేదనీ, ఇదంతా అబద్ధమనీ, ప్రజల్ని దోచుకునేందుకే కోవిడ్19 పేరుతో హడావిడి చేస్తున్నారనీ పేర్కొన్నట్లు చీఫ్ ప్రాసిక్యూటర్ నవాఫ్ అల్ అవాది చెప్పారు. కాగా, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు బహ్రెయిన్‌లో పలు చర్యలు చేపట్టారు. దేశంలోకి వచ్చే ఎంట్రీ పాయింట్స్ వద్ద తనిఖీలు నిర్వహించడం, ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ విధించడం తదితర కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో మాస్క్‌లను తప్పనిసరి చేసింది బహ్రెయిన్ ప్రభుత్వం.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు