తెలంగాణ లో 74 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ లో 74 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్:తెలంగాణలో శనివారం కొత్తగా 74 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 2499 కు చేరుకుంది. తాజాగా నమోదైన కేసుల్లో 60 కేసులు తెలంగాణ రాష్ట్రంలోనివి కాగా.. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 9 మందికి సోకింది. అటు, ఇతర దేశాల నుంచి వచ్చిన 5మందికి కరోనా సోకింది. గడిచిన 24 గంటల్లో ఆరుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 77 చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1412 మంది డిశ్చార్జ్ అవ్వగా.. 1010 మంది చికిత్స పొందుతున్నారు.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Back to Top