కోవిడ్-19:బ్యాక్టీరియా కారణంగా కరోనా అంటూ వదంతులు..కొట్టిపారేసిన యూఏఈ ఆరోగ్యశాఖ
- June 01, 2020
యూఏఈ:కరోనా వ్యాప్తిపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను యూఏఈ ఆరోగ్య శాఖ కొట్టిపారేసింది. బ్యాక్టీరియా కారణంగా కోవిడ్ 19 సోకుతుందని ఇటీవల సోషల్ మీడియాలో కొందరు అపోహలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ ఫరిదా అల్ హోసాని..కోవిడ్ 19 వ్యాప్తికి బ్యాక్టిరియాతో అసలు సంబంధమే లేదని స్పష్టత ఇచ్చారు. బ్యాక్టిరియా కారణంగా కరోనా వ్యాప్తి చెందుతుందనే ప్రచారం శుద్ధ అబద్ధమని ఆమె అన్నారు. SARS-CoV-2 అనే కరోనావైరస్ రకం వైరస్ ద్వారా కరోనా సోకుతుందని క్లారిటి ఇచ్చారు. అయితే..కోవిడ్ 19 సోకిన కొద్దిమందిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఉన్నాయని ఆమె అన్నారు. అలాగే కరోనాకు చికిత్స అందించటంలో భాగంగా అస్పిరిన్ టాబ్లెట్స్ వినియోగంపై కూడా ఆమె క్లారిటి ఇచ్చారు. అస్పిరిన్ వాడకంతో వైరస్ నుంచి రోగులు త్వరగా కోలుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. కోవిడ్ 19 ట్రిట్మెంట్ లో అసలు అస్పిరిన్ మాత్రలు ఉపయోగించొద్దన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







