డిపాచ్యూర్ ఫ్లైట్ లిస్ట్‌లో పేర్లు లేక పలువురు భారతీయుల నిరాశ
- June 01, 2020
కువైట్ సిటీ: పెద్ద సంఖ్యలో భారత కమ్యూనిటీకి చెందిన పలువురు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం భవనం వద్ద గల పార్కింగ్ లాట్‌లో నిరాశతో కన్పించారు. స్వదేశానికి వెళ్ళేందుకు వీరంతా ఇండియన్ ఎంబసీ సూచించిన విధంగా రిజిస్టర్ చేసుకున్నప్పటికీ, డిపాచ్యూర్ లిస్ట్‌లో చాలామంది పేర్లు కన్పించలేదు. దాంతో వారంతా నిరాశ చెందారు. కాన్సులేట్ జనరల్ తమ సమస్యకు పరిష్కారం చూపాలంటూ భారతీయ కమ్యూనిటీకి చెందిన పలువురు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కాగా, భారత ప్రభుత్వం, భారతీయులు స్వదేశానికి వచ్చేందుకోసం ఇండియన్ కాన్సులేట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించిన విషయం విదితమే. కరోనా వైరస్ నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకుపోయినవారిని స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం తగు చర్యలు చేపడుతోంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు