కువైట్:ఉద్యోగుల జీతాలపై కరోనా ఎఫెక్ట్...50%కోతకు తాత్కాలిక ముసాయిదా చట్టం
- June 02, 2020
కువైట్:కరోనా సంక్షోభ ప్రభావం ప్రైవేట్ ఉద్యోగులపై పడింది. ఉద్యోగుల జీతాల నుంచి 50 శాతం కోత విధించేందుకు అవకాశం ఇస్తూ కువైట్ ప్రభుత్వం తాత్కాలిక ముసాయిదా చట్టం తీసుకువస్తోంది. ఈ మేరకు పార్లమెంటరీ ఫైనాన్స్ కమిటీకి ప్రభుత్వం కొత్త ముసాయిదా చట్టాన్ని సిఫార్సు చేసింది. ముసాయిదా చట్టాన్ని మంత్రి మండలి ఆమోదించిన తర్వాత.. డ్రాఫ్ట్ నెం. 2020/86 మేరకు కరోనా కారణంగా ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన కంపెనీలకు ఊరట లభించనుంది. సంక్షోభం నుంచి తేరుకునే వరకు ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధించేలా ఆయా కంపెనీలు ఉద్యోగులతో ఒప్పందం చేసుకునేందుకు వెసులుబాటు కల్పించనుంది. అయితే..ఈ ముసాయిదా చట్టం తాత్కాలిక సమయం వరకు మాత్రమే అమలులో ఉంటుంది. పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ యధావిధిగా జీతాలు చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?