యూఏఈలో కారావ్యాన్లను కూరగాయల దుకాణంగా మార్చిన ఇద్దరికి భారీ జరిమానా
- June 02, 2020
యూఏఈ:ప్రజారోగ్య నిబంధనలు ఉల్లంఘించి కారావ్యాన్ల లను కూరగాయల దుకాణాలు మార్చిన ఇద్దరికి భారీ జరిమానా విధించారు. రస్ అల్ ఖైమా మున్సిపాలిటి పరిధిలోని ఈ ఘటన చోటు చేసుకుంది. కారావ్యాన్ వాహనాలనే కూరగాయలు, కిరాణా స్టోర్స్ మార్చినందుకు ఈ చర్యలు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కూరగాయలు, పండ్లు, కిరాణా స్టోర్స్ నడుపుతున్నట్లు సమాచారం అందుకున్న ఇన్స్ పెక్టర్ల టీం వెంటనే స్పాట్ కు చేరుకొని..స్టోర్స్ ను పరిశీలించింది. ఆహార నిల్వకు పాటించాల్సిన నిబంధనలేవి పాటించలేదని, ప్రజారోగ్యానికి సంబంధించి ప్రమాదకరమని భావించిన అధికారులు దుకాణ నిర్వాహకులకు భారీ జరిమానా విధించారు. కూరగాయలు, పళ్లు, కిరాణా వస్తువులను జప్తు చేశారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి నిబంధనల అమలులో రాజీ పడే ప్రసక్తే లేదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?