తెలంగాణలో కొత్తగా 99 కరోనా పాజిటివ్ కేసులు
- June 02, 2020
హైదరాబాద్:తెలంగాణలో కొత్తగా 99 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.మరో నలుగురు మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,891కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 87 మంది స్థానికులు కాగా, 12 మంది వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు 1,526 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 92 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,273 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా కేసుల్లో GHMC పరిధిలో 70, రంగారెడ్డి జిల్లాలో 7, మహబూబ్‌నగర్ జిల్లాలో 1, మేడ్చల్ జిల్లాలో 3, జగిత్యాల జిల్లాలో 1, నల్గొండ జిల్లాలో 2, మంచిర్యాల జిల్లాలో 1, సంగారెడ్డి జిల్లాలో 1, సిద్ధిపేట జిల్లాలో 1 నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







