దోహా: మెట్రోఫార్మిన్ కలిగిన ఔషధ ఉత్పత్తులు సురక్షితం.. స్పష్టత ఇచ్చిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ
- June 03, 2020
దోహా:ఖతార్ లోని లభించే మెట్రోఫార్మిన్ కలిగిన ఔషధ ఉత్పత్తులన్ని సురక్షితమైనవని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. అంతేకాదు..మెట్రోఫార్మిన్ కలిగిన ఔషధాలు అన్ని ఎన్-నైట్రోసోడిమెథైలామైన్(NMDA) ఫ్రీ అని కూడా స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఔషధ ఉత్పత్తులను ల్యాబ్ లో పరిశీలించి అధ్యాయనం చేసిన తర్వాత ఈ విషయాన్ని రూఢీ చేసింది. అంతేకాదు..ఖతార్ కు వచ్చే మెట్రోఫార్మిన్ కలిగిన ఔషధాలను ఎప్పటికప్పుడు డ్రగ్ కంట్రోల్ ల్యాబ్ లో పరిశీలించి, దాని పరిణామాలను విశ్లేషించ ప్రక్రియను కొనసాగిస్తామని కూడా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే అంతర్జాతీయ సంస్థలు, నియంత్రణ వ్యవస్థలతో ఎప్పటికప్పుడు సమాచార మార్పిడి చేసుకుంటూ తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.
మెట్రోఫార్మిన్ కలిగిన ఔషధాలలో పరిమిత మోతాదుకు మించి NMDA ఉందని, దీని ద్వారా క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని అమెరికా ఫుడ్ & డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్, యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ సమాచారంతో అప్రమత్తమైన ఖతార్ ఆరోగ్య శాఖ మెట్రోఫార్మిన్ లో NMDA మోతాదుపై ఎప్పటికప్పుడు విశ్లేషణ చేస్తూ ఈ మేరకు ప్రకటన చేసింది. ఖతార్ కు వచ్చే మెట్రోఫార్మిన్ మాత్రల్లో NMDA పరిమిత మోతాదులోనే ఉందని స్పష్టం చేసిన ఆరోగ్య శాఖ..డయాబెటిస్ పేషెంట్లకు చికిత్స అందించటంలో భాగంగా మెట్రోఫార్మిన్ కలిగిన మాత్రలను నిస్పందేహంగా వాడొచ్చని కూడా సూచించింది. డయాబెటిస్ కంట్రోల్ చేసేందుకు మెట్రోఫార్మిన్ దోహదపడుతుందని..వాటిని వినియోగాన్ని ఆపొద్దని సూచించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







